Puttaparthi పుట్టపర్తి అభివృద్ధికి చేయూతనివ్వండి
ABN , Publish Date - May 14 , 2025 | 11:40 PM
భగవాన శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టే అభివృద్ధి పనులకు సామాజిక బాధ్యతగా చేయూతనివ్వాలని పలు కార్పొరేట్ సంస్థలను ఎమ్యెల్యే పల్లె సింధూరారెడ్డి కోరారు.
పుట్టపర్తిరూరల్, మే 14(ఆంధ్రజ్యోతి): భగవాన శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టే అభివృద్ధి పనులకు సామాజిక బాధ్యతగా చేయూతనివ్వాలని పలు కార్పొరేట్ సంస్థలను ఎమ్యెల్యే పల్లె సింధూరారెడ్డి కోరారు. బుధవారం పుడా, మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలను జాయ్‌లుకాస్ కంపెనీ ప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కలెక్టర్ టీఎస్ చేతన, జాయ్‌లుకాస్ కంపెనీ ప్రతినిధులతో ఎమ్యెల్యే అభివృద్ధి పనులపై చర్చించారు. పుట్టపర్తి పర్యాటకరంగ అభివృద్ధికి తగిన నిధులి స్తామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అధికారి నరసయ్య, టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.