mla ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించండి
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:38 AM
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

పుట్టపర్తి రూరల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సత్యసాయిబాబా ట్రస్టు భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం సాద్యమైనంత త్వరగా కలెక్టరేట్‌తో పాటు 52 శాఖల కార్యాలయాలను నిర్మించి వాటికి సిబ్బంది నియమించడంతోపాటు సదుపాయాలు కల్పించాలని కోరారు.