Share News

రోడ్డుపై నిత్యం మురుగు

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:45 AM

స్థానిక పోలీస్‌ స్టేషనకు వెళ్లే దారి నుంచి బీసీ (ఉప్పర) కాలనీలోకి వెళ్లే మార్గంలో నిత్యం మురుగు, వర్షపు నీరు నిల్వ ఉంటోందని, సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీ మహిళలు డిమాండ్‌ చేశారు.

 రోడ్డుపై నిత్యం మురుగు
ఆందోళన చేస్తున్న మహిళలు

విడపనకల్లు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీస్‌ స్టేషనకు వెళ్లే దారి నుంచి బీసీ (ఉప్పర) కాలనీలోకి వెళ్లే మార్గంలో నిత్యం మురుగు, వర్షపు నీరు నిల్వ ఉంటోందని, సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీ మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పోలీస్‌ స్టేషనకు సీసీ రోడ్డును ఎత్తులో వేయడంతో బీసీ కాలనీ రోడ్డు పూర్తిగా తగ్గుగా మారి మురుగు బయటకు వెళ్లలేక అక్కడే నిల్వ ఉంటోందన్నారు. దీంతో ఆ రోడ్డు పాచిపట్టి.. జారి పడుతున్నామని , తీవ్ర దుర్వాసన వస్తోందని వాపోయారు. పోలీస్‌ స్టేషన దారిలోని డ్రైనేజీలు పూడికతో నిండిపోయి రోడ్డుపై వచ్చే నీరు కూడా తమ కాలనీలోకే వస్తోందన్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మహేష్‌ మహిళలుతో మాట్లాడుతూ మురికి నీరు నిలువ లేకుండా చర్యలు చేపడుతామన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:45 AM