ఓటు చోరీపై కాంగ్రెస్ సంతకాల సేకరణ
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:46 PM
బీజేపీ ఓటరు జాబితా గోల్‌మాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త దౌల్తాపురం ప్రభాకర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం చేపట్టారు.
గుంతకల్లు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఓటరు జాబితా గోల్‌మాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త దౌల్తాపురం ప్రభాకర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం చేపట్టారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీకి దేశాన్ని పాలించే అర్హత లేదని ఆయన విమర్శించారు. 18 శాతం ఉన్న జీఎస్టీని 28 శాతానికి పెంచి ప్రజలను దోచుకున్న మోదీ... ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న కారణంగా జీఎస్టీని తగ్గించానంటూ ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తగరం రామాంజనేయులు, నాయకులు లక్ష్మీనారాయణ, మహబూబ్ బాషా, యూసుఫ్ ఖాన, పొలికి రామచంద్ర, బీ పుల్లన్న, రహ్మతు ల్లా, విజయ మోహన రెడ్డి, తిమ్మారెడ్డి, డీ రవికుమార్, గుమ్మమ్మనూరు ఓబులేశు, తస్తానప్ప, మల్లేశ, సువర్ణ, దీప్తి పాల్గొన్నారు.