క్రీడలతో ఆత్మవిశ్వాసం: కలెక్టర్
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:13 AM
టమోటా రైతుల ఆనందం వారం తిరక్కుండానే ఆవిరైపోతోంది. పది రోజుల క్రితం కిలో రూ.50 దాటిన టమోటా ధరలు రూ.34కు పడిపోయాయి. వెరసి టమోటా ధరలు అన్నదాతల జీవితాలతో ఆటడుకుంటున్నాయి. రెండు వారాల క్రితం ఓ మోస్తారుగా సాగాయి. తరువాత ఉన్నఫలంగా ధరలు పెరిగిపోయాయి. ఉమ్మడి
మందగించిన ఎగుమతులు
ఆందోళనలో అన్నదాతలు
తిరోగమనంలో టమోటా ధరలుఅనంతపురంరూరల్/తనకల్లు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): టమోటా రైతుల ఆనందం వారం తిరక్కుండానే ఆవిరైపోతోంది. పది రోజుల క్రితం కిలో రూ.50 దాటిన టమోటా ధరలు రూ.34కు పడిపోయాయి. వెరసి టమోటా ధరలు అన్నదాతల జీవితాలతో ఆటడుకుంటున్నాయి. రెండు వారాల క్రితం ఓ మోస్తారుగా సాగాయి. తరువాత ఉన్నఫలంగా ధరలు పెరిగిపోయాయి. ఉమ్మడి జిల్లాలో కిలో గరిష్ట ధరలు రూ.50పైగా పలికాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. స్థిరంగా సాగుతున్నాయనుకునేలోపు మళ్లీ తిరోగమనం పట్టాయి. మూడునాలుగురోజులు పతనం వైపు పయనిస్తున్నాయి. జిల్లా నుంచి ఎగుమతులు మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. తనకల్లు మండలంలో ఖరీఫ్, రబీ సీజన్లతో సంబంధంలేకుండా వేలాది ఎకరాల్లో రైతులు టమోటా సాగు చేస్తుంటారు. టమోటా సాగుచేయడానికి ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ధరలు నిలకడగా ఉంటే ఎకరాకు రూ.5నుంచి 10 లక్షల వరకు ఆదాయం వచ్చేది. రైతులు అన్నమయ్య జిల్లా ములకలచెరువు, అంగళ్లు, మదనపల్లి మార్కెట్లతోపాటు, కర్ణాటకలోని చింతామణి, వడ్డిపల్లి, కోలార్‌కు టమోటాలను తరలిస్తున్నారు.
మూడు రోజుల నుంచి పతనం
అనంతపురం నగరం సమీపంలోని కక్కలపల్లి, కళ్యాణదుర్గంలో టమోటా మార్కెట్లు నడుస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణదుర్గంలో మండీలు బంద్ అయినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కక్కలపల్లి టమోటా మార్కెట్‌కు రోజూ 1800 నుంచి 2,300 టన్నుల వరకు వస్తున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం దిగుబడులు మార్కెట్‌కు తక్కుగానే వస్తున్నాయి. పదిహేను రోజుల కిందట వరకు మేలిరకం కాయలు గరిష్టంగా కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య పలికాయి. తరువాత అమాంతం పెరిగి కిలో రూ. 50తో అమ్ముడుపోయాయి. సరాసరి ధరలు రూ.35కిపైగా.. కనిష్ట ధరలు రూ.25తో పలికాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. గడిచిన మూడునాలుగురోజుల్లో మార్కెట్‌లో ధరలు పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది.
మందగించిన ఎగుమతులు
ధరల తగ్గుదలకు కారణాలు లేకపోలేదు. మార్కెట్ నుంచి ఎగుమతులు మందగించడం ధరల్లో తగ్గుదలకు ప్రధాన కారణమన్న వాదనలు ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వాతావారణంలో నెలకొన్న మార్పులు మరోకారణంగా నిలుస్తున్నాయి. నాలుగైదురోజుల కిందట వరకు స్థానిక మార్కెట్ నుంచి ఉత్తరప్రదేశ, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతులు జరిగేవీ. ఆయా ప్రాంతాల్లోని స్థానిక మార్కెట్లకు దిగుబడులు లేకపోవడంతో ఎగుమతులు ఆశాజనకంగా సాగాయి. ప్రస్తుతం ఎగుమతులు చాలా వరకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక మార్కెట్‌కు ఆయా ప్రాంతాల నుంచి దిగుబడులు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కేవలం ఆంధ్ర, తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే ఇక్కడి నుంచి కాయలు ఎగుమతి అవుతున్నాయి.