Share News

కల్తీ పెట్రోల్‌ విక్రయించారని ఆందోళన

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:26 AM

స్థానిక గాంధీ సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కల్తీ చేసి విక్రయిస్తున్నారని గుంతకల్లు రోడ్డులోని పిండిమిషన యజమాని చంద్రశేఖర్‌ మంగళవారం ఆందోళన చేశాడు

కల్తీ పెట్రోల్‌ విక్రయించారని ఆందోళన
పెట్రోల్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఐ, రెవెన్యూ అధికారులు

గుత్తి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక గాంధీ సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కల్తీ చేసి విక్రయిస్తున్నారని గుంతకల్లు రోడ్డులోని పిండిమిషన యజమాని చంద్రశేఖర్‌ మంగళవారం ఆందోళన చేశాడు. ఓ బాటిల్‌లో పెట్రోల్‌ పోయించుకోగా.. పెట్రోల్‌ తెల్లగా ఉం డటంతో కల్తీ చేశారంటూ ఆ బంక్‌ నిర్వాహకులతో వాగ్వివాదం దిగాడు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనారాయణ, సీఎ్‌సడీటీ ప్రవీణ్‌కుమార్‌ ఆ బంక్‌లో పెట్రోల్‌ను పరిశీలించారు. పెట్రోల్‌ శాంపిల్‌ను తీసుకుని ప్రయోగశాలకు పంపారు.

Updated Date - Oct 22 , 2025 | 12:26 AM