గోకులం షెడ్ల బిల్లుల కోసం ఆందోళన
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:13 AM
గోకులం షెడ్ల నిర్మాణాలు పూర్తయి తొమ్మిది నెలలుపైగా అవుతున్నా తమకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని పలువురు గోకులం లబ్ధిదారులు సోమవారం ఏపీఓ మద్దిలేటితో వాగ్వాదానికి దిగారు.
యాడికి, సెప్టెంబరు8(ఆంధ్రజ్యోతి): గోకులం షెడ్ల నిర్మాణాలు పూర్తయి తొమ్మిది నెలలుపైగా అవుతున్నా తమకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని పలువురు గోకులం లబ్ధిదారులు సోమవారం ఏపీఓ మద్దిలేటితో వాగ్వాదానికి దిగారు. తాము అప్పులుచేసి షెడ్లను నిర్మించామని వాపోయారు. దీనిపై ఏపీఓ మద్దిలేటి మాట్లాడుతూ.. మండలంలో పదిమంది లబ్ధిదారుల బిల్లులు రిజెక్ట్ అయ్యాయని, త్వరలోనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపడతామని తెలిపారు.