యూరియా కోసం ఆందోళన
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:24 AM
మండలంలోని ఉద్దేహాళ్‌లోని రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆదివా రం వర్షంలోనూ తడుస్తూ... ఆందోళన చేపట్టారు. రైతుకు కనీసం 10 బస్తాలైనా ఇవ్వాలని.. రెండు బస్తాలు ఎక్కడ సరిపోతాయని అధికారులను నీలదీశారు
బొమ్మనహాళ్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉద్దేహాళ్‌లోని రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఆదివా రం వర్షంలోనూ తడుస్తూ... ఆందోళన చేపట్టారు. రైతుకు కనీసం 10 బస్తాలైనా ఇవ్వాలని.. రెండు బస్తాలు ఎక్కడ సరిపోతాయని అధికారులను నీలదీశారు. సొసైటీలకు ఇవ్వకుండా కేవలం రైతు సేవా కేంద్రానికి మాత్రమే ఇస్తుండటంపై రైతులు మండిపడ్డారు. ప్రస్తుతం నాట్లు వేసి 15 రోజులు దాటినా.. పైరుకు యూరియా మొదటి దశలో కూడా వేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మరింత యూరియా త్వరలో వస్తుందని.. అందరికి ఇస్తామన్నారు. ఇప్పటివరకు 75.6 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి వచ్చినట్లు ఏఓ సాయికుమార్ తెలిపారు.