కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటం
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:15 AM
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గురు ఉపాధి హామీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.
పుట్లూరు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గురు ఉపాధి హామీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వారిలో ఓ కంప్యూటర్ ఆపరేటర్ తనదైనశైలిలో చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడు. నూతన జాబ్‌కార్డులు, మార్పులు చేర్పులు, ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లింపు .. ఇలా ఒక్కో దానికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్లు తమ గ్రామంలోని నూతన జాబ్‌కార్డులకు దరఖాస్తు చేసుకుంటే అందరి అనుమతి ఉన్నా ఆయనకు డబ్బులు ఇస్తేనే పని అవుతుంది. గతంలో గ్రామస్థులు అతడిపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం. మండలం నుంచి అతను బదిలీ అయినా.. తిరిగి ఇక్కడికే బదిలీ చేయించుకున్నాడు. అతనికి అవినీతిలో అధికారులకూ వాటాలు ఉన్నాయని, అందుకే అతనిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీఓ తులసీప్రసాద్‌ను వివరణ కోరగా.. అతనిపై ప్రస్తుతానికి అలాంటి ఆరోపణలు రాలేదని.. వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.