Share News

Computer lab కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:30 PM

స్థానిక కోట వీధిలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో వెబ్‌ టెక్‌ సంస్థ రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్త మంగళవారం ప్రారంభించారు.

Computer lab కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం
కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న డీఆర్‌ఎం

గుత్తి, జూన 24(ఆంధ్రజ్యోతి): స్థానిక కోట వీధిలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో వెబ్‌ టెక్‌ సంస్థ రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్త మంగళవారం ప్రారంభించారు. గుత్తి రైల్వే డీజిల్‌ షెడ్‌లో ఎలకి్ట్రకల్‌ లోకో షెడ్లను నిర్వహిస్తున్న వెబ్‌ టెక్‌ కంపెనీ ఈ కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం గుత్తి రైల్వే డీజిల్‌ షెడ్‌ను డీఆర్‌ఎం తనిఖీ చేశారు. రైల్వే ఆసుపత్రి సమీపంలో నిర్మించిన టెన్నీస్‌ కోర్ట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్‌ డీఎంఈ ప్రమోద్‌, ఏడీఎంఈ అశోక్‌గౌడ్‌, చంద్ర, సీనియర్‌ సెక్షన ఇంజనీర్‌ మనోజ్‌, ఎలకి్ట్రకల్‌ సెక్షన అధికారి గోవిందరాజులు, సూపర్‌వైజర్లు, పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:30 PM