Share News

yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్‌

ABN , Publish Date - May 22 , 2025 | 12:20 AM

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవన శైలిని పొందవచ్చని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు.

yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్‌
పుట్టపర్తిలో యోగా చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

పుట్టపర్తిటౌన, మే 21(ఆంధ్రజ్యోతి): క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంత జీవన శైలిని పొందవచ్చని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం పుట్టపర్తిలోని సాయిఆరామం ఫంక్షనహాల్‌లో యోగా అభ్యాస కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభిచారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగాను సాధన చేయాలన్నారు. మే 21 నుంచి జూన 21 వరకు నెలరోజుల పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగా గురువు చంద్రశేఖర్‌రెడ్డి, అధికారులతో ఆసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాశాఖాధికారి ఉదయ్‌భాస్కర్‌, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీఎంఅండ్‌హెచఓ ఫిరోజ్‌బేగం, పర్యాటక శాఖాధికారి ప్రతా్‌పరెడ్డి, డీపీఆర్వో వేలాయుధం పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:20 AM