నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:39 AM
వజ్రకరూరు మండలంలోని రాగుల పాడు, కొనకొండ్ల గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారలకు ఆదేశించారు.
వజ్రకరూరు (ఉరవకొండ), డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలంలోని రాగుల పాడు, కొనకొండ్ల గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారలకు ఆదేశించారు. బుధవా రం వాటిని పరిశీలించిన ఆయన మా ట్లాడారు. ఈ భవనాల నిర్మాణానికి నిధులు ఉన్నా యని, పేమెంట్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నా రు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. స్థానిక 1వ వార్డులో తాగునీటి సమ స్య తీర్చాలని, విద్యుత స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు. భూవివాదం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఆర్వోపైన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్, డీఎల్‌డీవో విజయలక్ష్మి, తహసీల్దారు నరేష్, ఎంపీడీవో శివాజీ రెడ్డి, ఏఈ మణిభూషణ్, ఈవోఆర్డీ దామోదర్‌రెడ్డి ఉన్నారు.