Share News

రైతులకు పరిహారం అందజేత

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:04 AM

డీ.హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ క్రాసింగ్‌ రైల్వే స్టేషన నిర్మాణంలో భూములు కోల్పోయిన కాదలూరు గ్రామ రైతులకు ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు నష్ట పరిహారం చెక్కులను గురువారం రాత్రి అందజేశారు.

రైతులకు పరిహారం అందజేత
చెక్కు అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ కాలవ

రాయదుర్గం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): డీ.హీరేహాళ్‌ మండలం బాదనహాళ్‌ క్రాసింగ్‌ రైల్వే స్టేషన నిర్మాణంలో భూములు కోల్పోయిన కాదలూరు గ్రామ రైతులకు ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు నష్ట పరిహారం చెక్కులను గురువారం రాత్రి అందజేశారు. పట్టణంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో సంబంధిత అధికారుల సమక్షంలో 13 మందికి రూ.29.96 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, టీడీపీ నాయకులు మోహనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:04 AM