Share News

Janasena party పిఠాపురం బహిరంగ సభకు తరలిరండి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:18 AM

: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి లకం మధుసూదనరెడ్డి పిలుపు నిచ్చారు.

Janasena party పిఠాపురం బహిరంగ సభకు తరలిరండి
ధర్మవరం : పోస్టర్‌ విడుదల చేస్తున్న చిలకం, నాయకులు

ధర్మవరం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి లకం మధుసూదనరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో పోస్టర్‌ను విడుదల చేసిన ఆయన మాట్లాడారు. పిఠాపురం మహాసభకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తల కోసం బస్సు, భో జన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ ఇనచార్జ్‌ ఆకుల రమేశ, రాప్తాడు నియోజకవర్గ ఇనచార్జ్‌ సాకేపవన కుమార్‌, పెనుకొండ నాయకులు కుమార్‌, మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస ్తశ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యాంకుమార్‌, నాయకులు మోహననాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:18 AM