రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:19 PM
ముచ్చుకోట సమీపాన ఎనహెచ 544డీ రోడ్డు పనులను, గ్రామ సమీపాన టోల్‌ప్లాజా పనులను కలెక్టర్ ఆనంద్ గురువారం పరిశీలించారు.
పెద్దపప్పూరు, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ముచ్చుకోట సమీపాన ఎనహెచ 544డీ రోడ్డు పనులను, గ్రామ సమీపాన టోల్‌ప్లాజా పనులను కలెక్టర్ ఆనంద్ గురువారం పరిశీలించారు. ఆయన కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. గ్రామంలోని రోడ్డు విస్తరణతో భూములు, ఇళ్లు కోల్పోయిన వారి నష్టపరిహారం గురించి ఆరా తీశారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ శ్వేత, వీఆర్వో లక్ష్మన్న, రెవెన్యూ సిబ్బంది జాఫర్ ఉన్నారు.