collector భూసేకరణ వేగవంతం చేయాలి కలెక్టర్ టీఎస్ చేతన
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:45 PM
జాతీయ రహదారుల నిర్మాణానికి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో మంగళవారం 342, 716జీ రహదారుల భూసేకరణ పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

పుట్టపర్తిటౌన, మార్చి11(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారుల నిర్మాణానికి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో మంగళవారం 342, 716జీ రహదారుల భూసేకరణ పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, నేషనల్ హైవే అధికారులు అశోక్‌కుమార్, ముత్యాలరావు, నాగరాజు, సుజాత, తహసీల్దార్లు మారుతి, కళ్యాణ్‌చక్రవర్తి, సురేష్‌బాబు, షహబుద్దీన పాల్గొన్నారు.
ఎన్నికల కమిషన ఆదేశాలు తప్పక పాటించాలి: కలెక్టర్
పుట్టపర్తిటౌన, మార్చి11(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ఎన్నికల కమిషన ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని కలెక్టర్ టీఎస్ చేతన మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఓటరు నమోదు, జిల్లా ఎన్నికల అధికారి, ముఖ్య ఎన్నికల అధికారి స్థాయిలో పరిష్కారంకాని సమస్యల కోసం ఏప్రిల్ 30నాటికి అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి భారత ఎన్నికల సంఘం సూచనలు ఆహ్వానించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీలకు లేఖలు పంపామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా చర్చలు సాగిస్తున్నామన్నారు. సమావేశాల్లో ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈనెల 31లోపు కమిషనకు నివేదికను సమర్పించనున్నట్లు చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.