Share News

Collector బాల్యవివాహాలు అరికట్టాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:57 AM

బాల్య వివాహాలు అరికట్టి, బాల్య వివాహ రహిత జిల్లాగా శ్రీసత్యసాయి జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు.

Collector బాల్యవివాహాలు అరికట్టాలి: కలెక్టర్‌
అధికారులతో సమావేశమైన కలెక్టర్‌

పుట్టపర్తి టౌన, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు అరికట్టి, బాల్య వివాహ రహిత జిల్లాగా శ్రీసత్యసాయి జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన వాత్సల్య పథకంలో భాగంగా జిల్లాలో బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరగకుండా గ్రామం నుంచి వార్డు స్థాయిలోనే సకాలంలో నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలు, ఐసీడీఎస్‌ కేంద్రాలు, పోలీస్‌ శాఖ, గ్రామ, వార్డు స్థాయిలోనే సకాలంలో బాల్యవివాహాల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల నివారణలో గ్రామ, వార్డు, మహిళాపోలీస్‌, ఆశ, అంగనవాడీలు కీలక పాత్ర పోషించాలన్నారు. మిషన వాత్సల్య పథకంలో సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు చేయడం నేరమని వివిధ మతాల పెద్దలకు సైతం తెలియజేయాలన్నారు. ఫంక్షన హాళ్లలో కూడా బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమనే నినాదంతో పోస్టర్లు వేయించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయ్‌కుమార్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళీకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ ప్రమీల, డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, బీసీ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు రాజేంద్రరెడ్డి, రెడ్డి బాలాజి, డీఈఓ కిష్టప్ప, డీసీహెచఎ్‌స డాక్టర్‌ మధుసూదన, జిల్లా సచివాలయాల అధికారి సుధాకర్‌ రెడ్డి, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అధికారి హరికృష్ణ, డీసీపీఓ మహేష్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:57 AM