Share News

Collecter అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:44 AM

ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సతో కలెక్టరేట్‌ కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 498 అర్జీలు అందజేశారు.

Collecter అర్జీలను త్వరగా పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఆనంద్‌

కలెక్టర్‌ ఆనంద్‌.. కిక్కిరిసిన కలెక్టరేట్‌

498 వినతుల స్వీకరణ

అనంతపురం కలెక్టరేట్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సతో కలెక్టరేట్‌ కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 498 అర్జీలు అందజేశారు. కలెక్టర్‌తో పాటు జేసీ శివ్‌నారాయణ్‌శర్మ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన, మల్లికార్జున, తిప్పేనాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు వినతులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం ఉండరాదన్నారు. పెండింగులో ఉంచకుండా తక్షణం పరిష్కరించాలని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రతి రోజూ సమీక్షిస్తూ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం నగరపరిధిలోని హెచ్చెల్సీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, ఆ సమస్యను పరిష్కరించాలని భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కోరాడు. ఈ మేరకు పీజీఆర్‌ఎ్‌సలో వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి పరిధిలోని వంక పొరంబోకు భూములను ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆ భూములకు సంబంధించి సర్వే చేసి హద్దులు వేయాలని కోరారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాడిపత్రి మీదుగా ఎర్రకాలువ అనే వంక 15కిలోమీటర్ల మీదుగా వెళ్తుందని, ఆ కాలువ పరిధిలో వంక పొరంబోకు భూములు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Dec 09 , 2025 | 12:44 AM