Share News

ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి అండ : ఎమ్మెల్యే

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:05 AM

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.

  ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి అండ : ఎమ్మెల్యే
భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గురువారం పట్టణంలో ఏపీ నాన గెజిటెడ్‌, గెజిటెడ్‌ ఉద్యోగుల అసోసియేషన నూతన భవనాన్ని ఏపీఎనజీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వలేకపోయిందని, ప్రశ్నించిన ఉద్యోగులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిందని అన్నారు. కాని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇస్తూ.. ఇచ్చిన హామిలన్నీ నెరవేరుస్తోందని అన్నారు. కాగా ఈ భవన నిర్మాణానికి రూ. 4 లక్షలు అందజేసిన ఎమ్మెల్యేను సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, ఆయాశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:05 AM