సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:10 AM
నియోజకవర్గంలోని 30 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 8.89 లక్షలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను విప్ కాలవ శ్రీనివాసులు తన స్వగృహంలో బాధితులకు గురువారం అందజేశారు
రాయదుర్గంరూరల్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని 30 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 8.89 లక్షలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను విప్ కాలవ శ్రీనివాసులు తన స్వగృహంలో బాధితులకు గురువారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలోని 210 మందికి రూ. 1.76 కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైనట్లు విప్ తెలిపారు. ఇందులో పట్టణ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మండల కన్వీనర్ కురుబ హనుమంతు పాల్గొన్నారు.