ఆయకట్టు కాలువల మూసివేత
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:44 PM
తన భూమిలోకి నీరు వస్తోందనే నెపంతో రాజస్థానకు చెందిన ఓ బడా భూస్వామి కంబదూరు చెరు వు ఆయకట్టు పరిధిలోని పిల్ల కాలువలను పూర్తిగా మూసివేశాడు
కళ్యాణదుర్గం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): తన భూమిలోకి నీరు వస్తోందనే నెపంతో రాజస్థానకు చెందిన ఓ బడా భూస్వామి కంబదూరు చెరు వు ఆయకట్టు పరిధిలోని పిల్ల కాలువలను పూర్తిగా మూసివేశాడు. కంబదూరు మండలంలోని ఒంటారెడ్డిపల్లి, జెల్లిపల్లికి మీదుగా రాళ్లఅనంతపురానికి వెళ్లే ఆయకట్టు కాలువన్నీ ఎక్స్‌కవేటర్‌తో రెండు రోజుల క్రితం మూసివేయించాడు. దీన్ని రైతులు గమనించి ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దారు బాలకిషన దృష్టికి శుక్రవారం తీసుకెళ్లారు. ఆయకట్టు కాలువన్నీ పూర్తిగా మూసి వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. అధికారులు ఆ ప్రాంత భూములను పరిశీలించి సంబంధిత ఆ రైతుపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.