చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:57 AM
యాడికిలోని మార్కెట్‌వీధిలోని చౌడేశ్వరిదేవికి జ్యోతుల ఉత్సవాన్ని బుధవారం తొగటవీరక్షత్రియులు ఘనంగా నిర్వహించారు.
యాడికి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): యాడికిలోని మార్కెట్‌వీధిలోని చౌడేశ్వరిదేవికి జ్యోతుల ఉత్సవాన్ని బుధవారం తొగటవీరక్షత్రియులు ఘనంగా నిర్వహించారు. స్థాని క దేవర ఇంటి వద్ద నుంచి తొమ్మిది జ్యోతులను బస్టాండ్, పెద్దమ్మ ఆలయం, వైశ్యా వీధుల గుండా ఊరేగిస్తూ.. చౌడేశ్వరి దేవికి సమర్పించారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, ధర్మవరం, హిందూపురం, సోమందేపల్లి నుంచి భక్తులు జ్యోతుల ఉత్సవాన్ని తిలకించడానికి తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.