ఘనంగా చిరంజీవి జన్మదినం
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:20 PM
సినీ నటుడు, పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు, పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్థానిక మస్తానయ్య దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. పేదలకు అల్పాహారం ప్యాకెట్లను అందజేశారు. వాసవీ టాకి్‌సలో కేక్ కట్ చేశారు. అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కురుబ పురుషోత్తం ఆధ్వర్యంలో అమృత వర్షిణి బాల కల్యాణ ఆశ్రమంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స పట్టణ అఽధ్యక్షుడు పాండుకుమార్, పూల ఎర్రస్వామి, పవర్‌శేఖర్, కొండపల్లిఅంజి, అనిల్, కృష్ణ పాల్గొన్నారు.