Children పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలి
ABN , Publish Date - May 16 , 2025 | 12:10 AM
ప్రత్యేక అవసరాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాల్లో చేర్పించాలని ఎస్‌ఎ్‌సఎ (అడిషనల్) ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ దేవరాజ్ పేర్కొన్నారు.
బుక్కపట్నం, మే 15(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాల్లో చేర్పించాలని ఎస్‌ఎ్‌సఎ (అడిషనల్) ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ దేవరాజ్ పేర్కొన్నారు. గురువారం మండలకేంద్రంలో ప్రత్యేక అవసరాలు క లిగిన పిల్లలపై జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఐఈఆర్పీలు ఇంటింటికెళ్లి వినికిడి లోపం, నిర్దిష్ట అంగవైకల్యం తదితర సమస్యలతో బాధపడుతు న్న పిల్లలను గుర్తించి ఆయా పాఠశాలలో చేర్పించాలని కోరారు. అలాగే వారికి సదరమ్ కార్డు నమోదు చేసి సర్టిఫికెట్ వచ్చేలా చేయాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు భవితకేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. ఇలాంటి పిల్లలకు ప్రభుత్వం పలురకాల పథకాలు అందిస్తోందన్నారు. ఆయన వెంట ఐఈఆర్పీలు అరుణ, మల్లికార్జున ఉన్నారు.