Chess చెస్ శిక్షణ ప్రారంభం
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:41 PM
స్థానిక కళాజ్యోతిలో వేసవి ఉచిత చెస్ శిక్షణ శిబిరాన్ని కళాజ్యోతి సంఘం ప్రసిడెంట్ నారాయణప్ప శుక్రవారం ప్రారంభించారు.
ధర్మవరం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): స్థానిక కళాజ్యోతిలో వేసవి ఉచిత చెస్ శిక్షణ శిబిరాన్ని కళాజ్యోతి సంఘం ప్రసిడెంట్ నారాయణప్ప శుక్రవారం ప్రారంభించారు. ఈ శిక్షణ మే 25వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణకు 150 మంది హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో కళాజ్యోతి సంఘం సెక్రటరీ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శింగనమల రామకృష్ణ, వెంకటేశ, విశ్రాం త అధ్యాపకులు సోమశేఖర్ ప్రసాద్, లయన్స క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి రమేశ బాబు, కోశాధికారి నాగేంద్ర, శిక్షకులు శివకృష్ణ, ఆదిరత్నం, కిశోర్ పాల్గొన్నారు.