వైరస్‌కు వేపనూనెతో చెక్ : జేడీఏ
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:20 AM
కంది పంటలో అక్కడక్కడా వైరస్ తెగుళ్లు ఉందని, వేపనూనె, వేపగింజల కషాయాన్ని పిచికారి చేసి దాన్ని నివారించుకోవచ్చని జేడీఏ ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు.
ఉరవకొండ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కంది పంటలో అక్కడక్కడా వైరస్ తెగుళ్లు ఉందని, వేపనూనె, వేపగింజల కషాయాన్ని పిచికారి చేసి దాన్ని నివారించుకోవచ్చని జేడీఏ ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. మం డలంలోని చిన్నముష్టూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన పొలంపిలుస్తోంది కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కందికి పూత దశలో వచ్చే మరక మచ్చ తెగుళ్లు నివారణకు క్లోరో నెట్రీ, నిల్ర్ఫోల్ అనే మందు ను 60 మిల్లీలీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సత్యనారాయణ, ఏఓ రామకృష్ణుడు పాల్గొన్నారు.