TRAFFIC JAM: దారికి అడ్డంగా సిమెంట్ లారీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:49 PM
నగరంలోనుంచి రూరల్ పరిధిలోకి వెళ్లే దారిలో సిమెంటు లారీ అడ్డంగా పెట్టడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. రుద్రంపేటలోని చంద్రబాబునగర్ ప్రధాన రహదారిలో పెట్రోలు బంకు పక్కనే ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు.
అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): నగరంలోనుంచి రూరల్ పరిధిలోకి వెళ్లే దారిలో సిమెంటు లారీ అడ్డంగా పెట్టడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. రుద్రంపేటలోని చంద్రబాబునగర్ ప్రధాన రహదారిలో పెట్రోలు బంకు పక్కనే ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి సిమెంటులోడుతో వచ్చిన లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి అనలోడ్ చేశారు. దీంతో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సిమెంటు లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో అటుగా తగరకుంట, సనప, యాలేరు నుంచి వచ్చే వాహనాలు వనవే లో ఎదురెదురుగా వెళ్లడంతో నానా వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అంతేగాక వనవేలో ఎదురుగా నాగుల కట్ట ఉండడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు వెంటనే లారీ పక్కకు తీయాలని వాగ్వాదానికి దిగినా మధ్యాహ్నం వరకు నిర్లక్ష్యంగా అలాగే రోడ్డుపైనే ఉంచడం గమనార్హం. మెయినరోడ్డులో ఇలా లారీని అడ్డంగా పెట్టి బాధ్యతారాహిత్యంగా భవన నిర్మాణదారులు వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.