Cattle పశువుల నీటితొట్టెలు ప్రారంభం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:39 PM
పలు ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల తాగునీట తొట్టెలను అధికారులు, టీడీపీ నాయకులు బుధవారం ప్రారంభించారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : పలు ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల తాగునీట తొట్టెలను అధికారులు, టీడీపీ నాయకులు బుధవారం ప్రారంభించారు. రాయదుర్గం మండలం బీఎనహళ్లిలో ఎంపీడీఓ కొండన్న, యాడికి మండలం వేములపాడులో ఎంపీడీఓ వీరరాజు, బెళుగుప్పలో టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు రమే్‌షయాదవ్, కుందుర్పి మండలం వడ్డేపాలెం గ్రామంలో మండల అభివృద్ధి అధికారి లక్ష్మీశంకర్ పశువుల నీటి తొట్టెలను ప్రారంభించారు.