Car fire కారు దగ్ధం
ABN , Publish Date - May 16 , 2025 | 12:05 AM
మండలంలోని చిగిచెర్ల సమీపంలో అనంతపురం నుంచి ధర్మవరం వెళ్తున్న ఓ కారులో మంటలు చేలరేగి.. కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ధర్మవరంరూరల్, మే15(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగిచెర్ల సమీపంలో అనంతపురం నుంచి ధర్మవరం వెళ్తున్న ఓ కారులో మంటలు చేలరేగి.. కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. అనంతపురానికి చెందిన వెనీల్ తన కారులో ధర్మవరం బయలుదేరాడు. చిగిచెర్ల గ్రామ సమీపంలోకి రాగానే ఉన్నఫళంగా కారులో ముందుభాగం నుంచి పొగలు వచ్చాయి. వెంటనే కారు పక్కకు ఆపి ఇంజన చెక్‌చేయగా ఇంజినలో నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ కారు పూర్తిగా దగ్ధమైంది. రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.