జోరుగా కాలువ పనులు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:09 AM
జల్లిపల్లి సమీపంలో తెగిన పీఏబీఆర్ కుడికాలువ పనులు త్వరితగతిన చేపడుతున్నారు.
కూడేరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జల్లిపల్లి సమీపంలో తెగిన పీఏబీఆర్ కుడికాలువ పనులు త్వరితగతిన చేపడుతున్నారు. సో మవారం ఆ పనులను ఇరిగేషన ఎస్‌ఈ సుధాకర్ రావు పర్యవేక్షించారు. కాలువ తెగిన ప్రదేశంలో బండరాయి ఉండటంతో మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో బండరాయికి అవసరమైన డ్రి ల్లింగ్ చేసి కాంక్రీట్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఆయన వెం ట ఈఈ శశిరేఖ, డీఈ విశ్వనాథ్‌రెడ్డి, ఏఈలు సుబ్రమణ్యం ఉన్నారు.