కాలువ పనులు ప్రారంభం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:41 PM
మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు ఉన్న కాలువలో ముళ్లకంపలు, పూడికతీత పనులను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆదివారం ప్రారంభించారు.
పుట్లూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు ఉన్న కాలువలో ముళ్లకంపలు, పూడికతీత పనులను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీరు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిందని, దీంతో ఈ పనులు చేపట్టామని అన్నారు. ఈ సాగునీటిని సరఫరా చేసే కాలువను త్వరలో వెడల్పుగా చేస్తామని, చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీరు అందిస్తామని అన్నారు. పూడికతీత పనులకు కాంటినెంటల్ కాఫీ సంస్థ ఎండీ చల్లా రాజేంద్రప్రసాద్ రూ.2 లక్షలు సాయం అందించాలన్నా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.