Share News

వేళకు రాని బస్సులు

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:36 AM

మండలంలోని గోనేహాళ్‌ క్రాస్‌, ఉప్పరహాళ్‌ క్రాస్‌, ఉద్దేహాళ్‌ గ్రామాల మీదుగా బొమ్మనహాళ్‌కు వెళ్లే బస్సులు వేళకు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వేళకు రాని బస్సులు
ఉద్దేహాళ్‌లో బస్సు కోసం వేచివున్న విద్యార్థులు

బొమ్మనహాళ్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోనేహాళ్‌ క్రాస్‌, ఉప్పరహాళ్‌ క్రాస్‌, ఉద్దేహాళ్‌ గ్రామాల మీదుగా బొమ్మనహాళ్‌కు వెళ్లే బస్సులు వేళకు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం వారికో సవాల్‌గా మారింది. విద్యార్థులు సమయానికి తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. అలాగే సాయంత్రం ఆలస్యంగా ఇళ్లకు చేరుతున్నారు. ప్రతి రోజూ బస్టాండ్‌ల వద్ద విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు మాత్రం సర్వీసులు క్రమంగా.. సజావుగా.. నడుస్తున్నాయి అంటున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు వేళకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:36 AM