వేళకు బస్సులు నడపాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:51 PM
విద్యార్థుల సౌకర్యార్థం గుత్తి నుంచి గుంతకల్లుకు అర్డినరీ బస్సులను వేళకు నడపాలని డీవైఎ్‌పఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు డిమాండ్ చేశారు.
గుంతకల్లుటౌన, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సౌకర్యార్థం గుత్తి నుంచి గుంతకల్లుకు అర్డినరీ బస్సులను వేళకు నడపాలని డీవైఎ్‌పఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గురువారం డీవైఎ్‌ఫఐ నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సురేంద్రబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి రోజు విద్యా సంస్థలకు వందలాది మంది పట్టణానికి వస్తున్నారని, వేళకు బస్సుల రాకపోవడంతో వారు త్రీవ ఇబ్బందులు పడుతుని అన్నారు. బస్సు పాస్ ఉన్నా ఆటోలో రావాల్సిన దుస్థితి నెలకొందని, ఆర్టీసీ అధికారులు స్పందించి వేళకు బస్సులను నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగా, జయరాం, శ్రీకాంత, లోకేష్, తిమ్మరాజు, అంజి, రాజేష్ పాల్గొన్నారు.