వేళకు సరిగా బస్సులు నడపాలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:23 AM
కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ మేరకు స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.
ఉరవకొండ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ మేరకు స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. బల్లనగుడ్డం, పాల్తూరు, గోవిందువాడ, హొన్నూరు మార్గాల్లో బస్సు సర్వీసులు నడపాలని అధికారులను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యార్థులకు పోలీసులు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు.