Share News

కళాశాల వేళలకు బస్సులు నడపాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:21 AM

ఉరవకొండ- దర్గాహొన్నూరు మార్గంలో కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయకార్యదర్శి హారున రషీద్‌ డిమాండ్‌ చేశారు.

కళాశాల వేళలకు బస్సులు నడపాలి
రాస్తారోకో నిర్వహిస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు, విద్యార్థులు

ఉరవకొండ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉరవకొండ- దర్గాహొన్నూరు మార్గంలో కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయకార్యదర్శి హారున రషీద్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురం - గుంతకల్లు రహదారిలోని ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవార విద్యార్థులతో కలిసి రాస్తారొకో నిర్వహించారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. సమస్యను ఏపీఎస్‌ ఆర్టీసీ జోనల్‌ చైర్మన పూల నాగరాజు దృష్టికి ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు తీసుకెళ్లారు.

Updated Date - Nov 22 , 2025 | 12:21 AM