Share News

ఉపాధి జీవో ప్రతుల దహనం

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:08 AM

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు ఆ జీవో ప్రతులను స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం దహనం చేశారు

ఉపాధి జీవో ప్రతుల దహనం
జీవో ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

ఉరవకొండ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడాన్ని నిరసిస్తూ ఏపీ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు ఆ జీవో ప్రతులను స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం దహనం చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పాత పద్ధతిలోనే ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, వెంకటేష్‌, సురేష్‌, సిద్ధప్ప పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:08 AM