జగన పత్రిక ప్రతుల దహనం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:52 PM
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాన్ని .. జగన పత్రి క వక్రీకరించి ప్రభుత్వంపై తిరుగుబాటు అని తప్పుడు ప్రచారం చేసిందని కురుబ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ నీలస్వామి మండిపడ్డారు.
కళ్యాణదుర్గంరూరల్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాన్ని .. జగన పత్రి క వక్రీకరించి ప్రభుత్వంపై తిరుగుబాటు అని తప్పుడు ప్రచారం చేసిందని కురుబ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ నీలస్వామి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక టీ సర్కిల్ వద్ద జగన పత్రిలను దహనం చేశారు. ఈ పేపర్ ప్రజల పక్షాన కాకుండా మాజీ సీఎం జగన, స్థానిక వైసీపీ సమన్వయకర్త రంగయ్య మెప్పుకోసం వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అమిలినేని చేస్తున్న అభివృద్ధి ఆ పత్రిక వాళ్లకు కనిపించదని, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. వైసీపీ ఖాళీ కాకుండా.. అభివృద్ధి చూసి ఓర్వలేకనే జగన పేపర్ ఇటువంటి తప్పుడు రాతలు రాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇనఛార్జ్ ఉమే్‌షగౌడ, పాల్వాయి పంచాయతీ కన్వీనర్ రాజ్‌కుమార్, ఉద్దీప్ సింహ, జనసేన నాయకులు అనిల్ కుమార్ పాల్గొన్నారు.