Share News

విద్యుదాఘాతానికి ఎద్దు మృతి

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:39 PM

మండలంలోని యర్రగుంటపల్లి గ్రామ సమీపంలో ఓ ట్రాన్సఫార్మర్‌ ఫ్యూజ్‌లను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేశారు

విద్యుదాఘాతానికి ఎద్దు మృతి
ఎద్దు కళేబరాన్ని చూపుతున్న రైతు

తాడిపత్రి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని యర్రగుంటపల్లి గ్రామ సమీపంలో ఓ ట్రాన్సఫార్మర్‌ ఫ్యూజ్‌లను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేశారు. ఆ గ్రామ రైతు బాలకృష్ణకు చెందిన ఎద్దు ఆదివారం అటుగా మేత మేయడానికి వెళ్లి వాటిని తగలడంతో అది అక్కడికక్కడే చనిపోయింది. తనకు దాదాపు రూ.70వేలు నష్టం వాటిల్లిందని బాలకృష్ణ వాపోయారు.

Updated Date - Oct 19 , 2025 | 11:39 PM