Share News

road ఆలయానికి రోడ్డు వేయండి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:26 PM

మండలంలోని నల్లగోండ యనుములవారిపల్లి సమీపంలో ఉన్న దేవరగుళ్లులోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సరైన దారి లేదు.

road ఆలయానికి రోడ్డు వేయండి
లక్ష్మీనరసింహస్వామి ఆలయ రహదారి

నల్లమాడ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని నల్లగోండ యనుములవారిపల్లి సమీపంలో ఉన్న దేవరగుళ్లులోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సరైన దారి లేదు. పాత బత్తలపల్లి మీదుగా కదిరికి వేళ్లే ప్రధాన రహదారి నుంచి దేవరగుళ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపం వరకు తార్‌ రోడ్డు వేశారు. అక్కడి నుంచి గుడి దాదాపు అర కిలోమీటర్‌ దూరంలో ఉంది. అయితే ఆ దారి ఎగుడు దిగుడు రాళ్లతో నిండి ఉంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ దారిన గుడికి వెళ్లడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఆలయానికి సమీపంలోని ఎనిమిది గ్రామాల వాసులు స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ శుభకార్యాలు జరుపుకుంటారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి గుడి వరకు రోడ్డు వేయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు కోరుతున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:26 PM