తెగిపడిన విద్యుత తీగ
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:33 AM
మండలంలోని ఉంతకల్లు గ్రామంలో పాత పంచా యతీ కార్యాలయం వీధిలో విద్యుత వైరు సోమవారం సాయంత్రం తెగిపడింది
బొమ్మనహాళ్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంతకల్లు గ్రామంలో పాత పంచా యతీ కార్యాలయం వీధిలో విద్యుత వైరు సోమవారం సాయంత్రం తెగిపడింది. ఆ సమయంలో వర్షం వస్తుండటంతో వీధిలో ఎవరూ లేరు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. వైరు తెగిన విషయాన్ని గమనించిన స్థానికులు విద్యుత అధికారులకు సమాచారం అందించారు. చాలాకాలంగా 11 కేవీ వైర్లు దెబ్బతిని.. ప్రమాదకరంగా వేలాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాత వైర్లను మార్చాలని కోరుతున్నారు.