Share News

బీటీపీ నిధుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లండి

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:44 PM

బీటీపీ ప్రాజెక్టు కాలువ పనుల కోసం సంబంధించి నిధులను మంజూరు చేయించే విధంగా క్యాబినెట్‌లో సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ముగ్గురు మంత్రులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోరారు.

బీటీపీ నిధుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లండి
మంత్రులకు సమస్యలు విన్నవిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): బీటీపీ ప్రాజెక్టు కాలువ పనుల కోసం సంబంధించి నిధులను మంజూరు చేయించే విధంగా క్యాబినెట్‌లో సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాలని ముగ్గురు మంత్రులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోరారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ, విద్యుతశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. నియోజకవర్గం నుంచే 480 ఆర్టీసీ బస్సులు కేటాయించామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా భోజనం, తాగునీరు, బిస్కెట్లు అందుబాటులో ఉండేలా నాయకులు చూసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మంత్రుల దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి మరింత నిధులు ఇవ్వాలని, వ్యవసాయానికి అవసరమైన ట్రాన్సఫార్మర్లు ఇవ్వాలని, నియోజకవర్గానికి కొత్త ఆర్టీసీ బస్సులు కేటాయించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు ఆ మంత్రులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:44 PM