క్రికెట్ పోటీలో బ్రహ్మసముద్రం విజేత
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:07 AM
మండలంలోని ఎర్రగుడి క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన ఉపాధ్యాయ క్రికెట్ ఫైనల్ పోటీల్లో కణేకల్లు జట్టుపై బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించింది.
బెళుగుప్ప, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రగుడి క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన ఉపాధ్యాయ క్రికెట్ ఫైనల్ పోటీల్లో కణేకల్లు జట్టుపై బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించింది. బ్రహ్మసముద్రం జట్టు 124 పరుగులు చేయగా.. కణేకల్లు జట్టు 108 పరుగులకే ఆల్ అవుట్ అయింది. విజేత జట్టును డీవైఈవో మల్లారెడ్డి, పీడీ గోపాల్ రెడ్డి అభినందించారు.