నీటికుంటలో పడి బాలుడి మృతి
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:20 AM
మండలంలోని రావులుడికి గ్రామ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు పడి కమలే్‌షరెడ్డి (10) అనే బాలుడు మృతి చెందాడు
పెద్దవడుగూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావులుడికి గ్రామ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు పడి కమలే్‌షరెడ్డి (10) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. బాలుడు రాయలచెరువు గ్రామంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తల్లి సువర్ణతో పాటు పొలంలోకి వెళ్లారు. కొద్ది సమయం తర్వాత తాను ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరి వెళ్లే క్రమంలో రహదారి పక్కన ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. అటుగా వెళుతున్న గ్రామస్థులు గమనించి రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. బాలుడికి పుట్టుకతోనే మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బాలుడు మృతిచెందడంతో ఆ తల్లి బాధ వర్ణతీతంగా మారింది.