గ్రామదేవతకు భక్తిశ్రద్ధలతో బోనాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:56 PM
మండలంలోని కరిగానపల్లిలో గ్రామదేవతకు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు.
కుందుర్పి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కరిగానపల్లిలో గ్రామదేవతకు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఇటీవలే గ్రామంలో గ్రామదేవతను ప్రతిష్ఠించారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువతులు, మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.