ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:47 PM
మండలంలోని బుగ్గసంగాలలో బుగ్గసంగమేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్ర మాణ స్వీకారం చేశారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని బుగ్గసంగాలలో బుగ్గసంగమేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్ర మాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండ ల చైర్మనగా ఎస్ ఈశ్వరయ్య, సభ్యులుగా లాలిరెడ్డిడ, సబ్బన్న, గంగమ్మ, ప్రకాశరావు, అరుణ సునీతబాయి, ఎం శ్రీనివాసులు, అర్చకుడిగా మంజునాథ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆలయ ఈఓ కృష్ణయ్య, టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి, టీడీపీ మండల అఽధ్యక్షుడు రామన్నచౌదరి, సింగిల్‌విండో చైర్మన తలారి మస్తానప్ప, నాయకులు పత్తిహిమబిందు, గుమ్మనూరు వెంకటేష్, జడ్పీటీసీ కదిరప్ప పాల్గొన్నారు.