Blood donation రక్తదానం శిబిరం
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:47 PM
ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు.
గుంతకల్లుటౌన, జూన 13(ఆంధ్రజ్యోతి): ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీ ల్దారు రమాదేవితో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్ర మంలో యాదవ్ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ ఆమ్లెట్‌మస్తాన యాదవ్, సంఘ సేవకుడు మేస్రీ దొడ్డప్ప, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి హరిప్ర సాద్‌యాదవ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆజేంద్రరావు పాల్గొన్నారు.