Share News

Blacklist ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:44 PM

పట్టణంలో అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు.

Blacklist ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి
మాట్లాడుతున్న టీడీపీ కౌన్సిలర్‌ కృపాకర్‌

గుంతకల్లు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలో అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. చైర్‌పర్సన ఎన భవాని అధ్యక్షతన గురువారం గుంతకల్లు పురపాలక సంఘ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో టీడీపీ కౌన్సిలర్లు కే కృపాకర్‌, పవనకుమార్‌ గౌడు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఇంజనీరింగ్‌ శాఖ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, పట్టణంలో కనీసం రెండు రోజులకోసారైనా చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమా వేశంలో కమిషనర్‌ నయ్యీం అహ్మద్‌, కౌన్సిలర్లు అనూరాధ, గుడిపాటి ఆంజనేయులు, విద్యారాణి, నాగరత్న పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:44 PM