మంటల్లో బైక్
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:33 AM
కళ్యాణదుర్గం-బళ్లారి రాహదారిపై మండల కేంద్రం సమీపాన సోమ వారం సాయంత్రం బైక్‌లో ఉన్నఫలంగా మంట లు చెలరేగడంతో అది పూర్తిగా కాలిపోయింది.
బొమ్మనహాళ్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) కళ్యాణదుర్గం-బళ్లారి రాహదారిపై మండల కేంద్రం సమీపాన సోమ వారం సాయంత్రం బైక్‌లో ఉన్నఫలంగా మంట లు చెలరేగడంతో అది పూర్తిగా కాలిపోయింది. మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన విజయ్ సరిహద్దులోని బంక్‌లో పెట్రోలు వేయించుకుని, సొంతూరికి వస్తున్నాడు. చెక్‌పోస్టు సమీపాన బైక్ ఇంజిన నుంచి పొగ రావడంతో వెంటనే ఆపి దిగేశాడు. క్షణాల్లోనే మంటలు చెలరేగి బైక్ బూడిదైంది.