Bhoomi Puja అభివృద్ధి పనులకు భూమిపూజ
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:31 AM
పట్టణంలోని 18వ వార్డులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం భూమిపూజ చేశారు.

గుంతకల్లు నెట్‌వర్క్, జూన 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 18వ వార్డులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోమవారం భూమిపూజ చేశారు. వాల్మీకినగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో రూ.10 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో డైనింగ్ హాల్ నిర్మాణానికి, అదే కాలనీలో రూ.27 లక్షలతో పైప్‌లైన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ చైర్‌పర్సన ఎన భవాని, కమిషనర్ నయ్యీం అహ్మద్, తహసీల్దారు రమాదేవి, నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, బీఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, తలారి మస్తానప్ప, తలారి జరోజమ్మ, వాసగిరి మణికంఠ పాల్గొన్నారు.