Share News

rtc ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - May 23 , 2025 | 10:59 PM

జిల్లాలోని 14 ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణీకులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

rtc ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పుట్టపర్తిటౌన, మే 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 14 ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణీకులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ప్రయాణీకులకు అందుతున్న సౌకర్యాలు గురించి ఆర్‌ఎం మధుసూధనను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ... జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత వాతావరణం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మరుగుదొడ్ల శుభ్రతను మెరుగుపరచాలన్నారు. బస్టాండ్‌ నుంచి బస్సులు బయలుదేరు వేళలు తెలిపే లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట డీఎం ఇనయతుల్లా, ఏఓ ఉషారాణి, అసిస్టెంట్‌ మేనేజర్‌ హరిత, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 23 , 2025 | 10:59 PM